ఓ పరలోక తండ్రి !మా రక్షణ, సంరక్షణార్దమై మీరు క్రీస్తుని తల్లి, శ్రీసభ మాత,మరియమాతను అమలోద్భవిమాతను, మా గ్రామ పాలక పునీతురాలుగామాకు ఇచ్చినందుకు మీకు వేలాది వ౦దనాలు, కృతజ్ఞతా స్త్రోత్రములు.
ఓ అమలోద్భవి మాత, మా పాలక పునీతురాలా!మా పూర్వీకులను, మమ్మును, మా గ్రామమును, పాడిపంటలనుకాచికాపాడినందుకు మీకు కృతజ్ఞతా స్త్రోత్రములు తల్లి.మమ్మును,మా గ్రామమును, మరల మీకు సమర్పించుకుంటూమీరు విశ్వసించినట్లే మేమును విశ్వసించునట్లు,త్రిత్వైక సర్వేశ్వరునియందు, శ్రీసభ నందు ఎల్లప్పుడుదృడముగా, ధైర్యముగా, ఉదారంగా వుండేలా విశ్వాసమును నేర్పండి.
మేము మాతోటి గ్రామస్తులతో ప్రేమతో-ఐక్యతతో, దయతో-ఓపికతో, సహనముతో-గౌరవముతో మెలిగేటట్లును ఆశీర్వదించండి.మా విచారణ గురువును, మా గ్రామ గురువులను, కన్యాస్త్రీలను, ధర్మధాతలను ఆశీర్వదించండి. మరణించిన మాపూర్వీకుల ఆత్మలకు నిత్యవిశ్రాంతిని, పరలోకనివాసమును దయచేయండి.
ఓ పరలోక తండ్రి! మాకు మా గ్రామమునకు శాంతి సమాధానము, ఆయురారోగ్యములను, మంచి ఆనందమును-ఆలోచనలను, పాడిపంటలను సమృద్దిగా దయచేయమనిమా పాలక పునీతురాలయిన అమలోద్భవిమాత ద్వార మిమ్ము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.
పరలోక జపము, మంగళవార్త జపము, త్రిత్వస్త్రోత్రము.అమలోద్భవి మాత - మాకొరకు వేడుకొనండినిత్యసహాయ మాత - మాకు సహాయముచేయండిసకలపునీతులారా - మాకొరకు వేడుకొనండిపిత, పుత్ర,పవిత్రాత్మకు మహిమకలుగునుగాక ---
గురువు: ఏలినవారు మీతోవుందురుగాక ..ప్రజలు: మీతోవుందురుగాకగురువు: సర్వశక్తిగల .....ప్రజలు: ఆమెన్.
అమలోద్భవి మాత పాట.